గొర్రెల మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి

Aug 5, 2025 - 17:09
Aug 5, 2025 - 18:46
 0  0
గొర్రెల మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి
మాట్లాడుతున్న ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్

మునగాల 05 ఆగస్ట్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.

 జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్* 

 సూర్యాపేట: అంతుచిక్కని వ్యాధితో ఒకే రోజు 150 గొర్రెలు చనిపోయాయని, గొర్రెల మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చనిపోయిన గొర్రె కు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం వి ఎన్ భవన్ లో జరిగిన తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం హనుమాన్ పల్లి కి చెందిన లింగప్ప, శివకుమార్ అనే గొర్రెల పెంపకం దారులు గత రెండు నెల క్రితం 20 లక్షల రూపాయలు పెట్టి 150 గొర్రెలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఇతరులతో కలిసి 1000 గొర్లతో వాటి మేత కోసం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం విజయ రాఘవాపురం, రామసముద్రం గ్రామాలకు వలస రావడం జరిగిందన్నారు. అకస్మాత్తుగా సోమవారం సాయంత్రం గొర్రెలు అంతుచిక్కని వ్యాధితో మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి చనిపోయిన కారణాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేసియా చెల్లించి గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు వీరబోయిన రవి, జిల్లా ఉపాధ్యక్షులు కంచు గట్ల శ్రీనివాస్, గుండాల లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జా వినయ్, రాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State