గుడి- బడి  ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన ఎస్సై విజయ్ కుమార్

Oct 30, 2024 - 13:16
 0  13
గుడి- బడి  ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన ఎస్సై విజయ్ కుమార్

జోగులంబ  గద్వాల30 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ  పట్టణ కేంద్రంలో  బుధవారం తెల్లవారుజామున  పాఠశాలలు దేవాలయాల ప్రాంతాలలో ఎస్సై విజయ్ కుమార్  తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారుల ఆటోలు, బొలెరోలు తదితర వాహనాలను  క్షుణ్ణంగా తనిఖీ చేశారు, అనంతరం వారిని మీరు ఏ ప్రాంత వాసులు అని,  అడ్రస్ ప్రూఫ్స్  ఆధార్ కార్డ్స్ మొదలగు వాటిని పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ...... వలసదారులు మరియు ఏ ఇతర వ్యక్తులైన గుడి బడి ప్రాంతాలలో రాత్రి వేళల్లో బస చేసేవారు  తప్పనిసరిగా అడ్రస్ ఫ్రూప్స్ ను తమ దగ్గర  ఉంచుకోవాలి అని అన్నారు  లేనియెడల చట్టపరమైన  చర్యలు   తప్పవు అన్నారు, అలాగే గుడి, బడి మరియు బహిరంగ ప్రదేశాలలో  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా  కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333