గదుల కొరతతో విద్యకు ఆటంకం
- పాఠశాలలోనే రహదారి ఏర్పాటు ఘోరం.
- వంటగది లేక ఆరుబయట చెట్లకిందనే వంట ఏర్పాటు.
- అంగన్వాడి, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఒకే చోట.
- తప్పని తిప్పలుగా మారిన విద్యార్థుల బోధన.
- కాంపౌండ్ వాల్ లేక ఇక్కట్లు.
- బాత్ రూమ్ లేక ఆరుబయటకు వెళ్తున్న విద్యార్థులు.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఊరు బయటకు తరలించాలి.
- సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం.
- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.
జోగులాంబ గద్వాల 25 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : కె.టి.దొడ్డి: మండలంలోని ఇర్కిచేడు గ్రామంలో విద్యార్థులు చదివే పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థుల బోధనకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, పాఠశాల అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలు తిష్ట వేశాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్య ముఖ్యమని, అలాంటి విద్య కోసం విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలలో అనేక రకాల సమస్యలు తిష్ట వేశారని తెలిపారు.
పదవ తరగతి వరకు కొనసాగుతున్న పాఠశాలలో గదుల కొరత తీవ్రతరంగా ఉండడంతో విద్యార్థుల ఒకే చోట ముడిపడడం చాలా కష్టతరమైందని, గ్రామంలో అనుకూలంగా ఉన్న ప్రభుత్వ స్థలానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఊరు బయటకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ స్కూల్, అంగన్వాడి పాఠశాలలు కూడా మూడు ఒకేచోట ముడి పడడంతో పాఠశాల ఇరుకునకు గురైందని, విద్యార్థుల ప్రామాణికాన్ని బట్టి, తరగతి గదులను పెంచుటకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినీలకు బాత్రూం లేక మూత్ర విసర్జనకు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, వెంటనే బాత్రూం లను నిర్మించాలని కోరారు. పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాల ఆవరాన్నే రహదారిగా ఏర్పాటు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
వంట గదులు లేక చెట్ల కింద ఆరుబయట వంట వార్పు చేయడం ద్వారా వర్షాకాల సమయంలో కష్టతరమైన పనిగా మారిందన్నారు. కావున వెంటనే గదుల కొరతను తీర్చి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో రాజకీయ నాయకులు కక్షపూరితంగా పాఠశాల విద్య,అభివృద్ధిపై రాజకీయం చేస్తున్నారని, అలాంటివి అలాంటి దురాలవాటును మానుకోవాలని హెచ్చరించారు. అంగన్వాడి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యల పరిష్కారం కోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల నాయకులు సుభాష్, విజయ్, గొర్ల తిమ్మప్ప, రమేష్,సుదర్శన్,గ్రామ నాయకులు జయప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.