కొలువుదీరిన చాగాపురం గ్రామపంచాయతీ కార్యవర్గం
జోగులాంబ గద్వాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల చాగాపురం గ్రామపంచాయితీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కొలువుదీరింది. సర్పంచ్ గా బుస్కలి సావిత్రమ్మ బాద్యతలు స్వీకరించారు. 12మంది వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. చాగాపురం గ్రామపంచాయతీ సెక్రటరీ వీరిచేత ప్రమాణస్వీకారం చేశారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.