కొత్త సంస్థలను ప్రోత్సహించి మార్కెటింగ్ నిర్వహణపై అవగాహన
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఉండవెల్లి రాజకుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉండవల్లి మండల కేంద్రంలోని ఐటిఐ కళాశాలలో మార్కెటింగ్ నిర్వహణపై మహిళలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవస్థాపక కార్యక్రమాలు అనేది వ్యక్తులు తమ వ్యాపార ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి వ్యాపారాలను స్థాపించడానికి నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సహాయపడే శిక్షణ మద్దతు కార్యక్రమాలు ఇవి కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం నైపుణ్యాలు పెంచడం మార్గదర్శకత్వం అందించడం వంటి వాటిపై దృష్టి పెడతాయని రత్నకుమారి అన్నారు. కొత్త సంస్థలను స్థాపించడం వ్యాపార అవకాశాలను గుర్తించడం మార్కెటింగ్ ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో నైపుణ్యాలను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాలైన పీఎం ఈజిపి, విద్యాసంస్థల కార్యక్రమాలు ఎన్ఐటి స్టాన్ఫోర్డ్ ఐఐఎంలో మరియు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల యాజమాన్యం మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.