కేడిదొడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన
పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్.
జోగులాంబ గద్వాల 13 మార్చ్ 2020 5 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండలం కొండాపురం, గువ్వలదిన్నె గ్రామాల్లో వరి పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్, వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు కింద పొలాలకు సాగు నీరందడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటించారు. ఆయకట్టు కిందా సాగు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.