చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Jun 15, 2025 - 21:24
 0  7
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. ఆత్మకూర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రానికి చెందిన గుణగంటి మధు (35) ఈనెల 8వ తారీఖున బైక్ పై నిమ్మికల్ నుండి ఆత్మకూరు వస్తుండగా ఆత్మకూరు నుండి నిమ్మికల్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మధు బైక్ కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మధుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాదులోని కేర్ ఆసుపత్రికి తరలించక చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.