తాటిపాములలో జరిగే కాంగ్రెస్ మీటింగ్ ను జయప్రదం చేయండి
మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి

అడ్డగూడూరు 21 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- మంగళవారం రోజు తిరుమలగిరి మున్సిపాలిటీ తాటిపాములలో జరిగే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ను విజయవంతం చేయాలని అడ్డగూడూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన అడ్డగూడూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిగ్రామం నుంచి గ్రామశాఖ అధ్యక్షులు వారితో పాటు ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 40 మంది చొప్పున కార్యకర్తలు నేడు 4 గంటలకు తరలి వెళ్లాలని,తాటిపాములలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొంటారని అన్నారు.అందుకుఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని ఎక్కడి వారు అక్కడ బయలుదేరి అధిక సంఖ్యలో వెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
లింగాల నర్సిరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశంసత్య నారాయణ,మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్య సాగర్ ,జై భీమ్ -జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్
కన్నెబోయిన గంగరాజు యాదవ్,
మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్,
మండల సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి,బాలెంల సురేష్,సట్టు రవి, తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు.