కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి

Feb 1, 2025 - 19:36
 0  9
కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి

 జిల్లా చైల్డ్ వెల్ఫేర్ చైర్ పర్సన్ కి ఫిర్యాదు చేసిన

బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల. జిల్లా కేంద్రంలోని చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్ ని కలిసి ఐజ మండల కేంద్రంలోని కృష్ణవేణి ప్రైవేట్ హైస్కూల్లో విద్యార్థిని చితకబాదిన సంఘటన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. 


ఈ సందర్బంగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ.. రెండవ తరగతి విద్యార్థి విరాట్ శంకర్ ను చితకబాదిన ఘటనలో కేవలం ఆ టీచర్ పైన నెపంవేసి ఆమెను తొలగించినమని కప్పిపుచ్చడం కుట్రపూరితం. ఇందులో టీచర్ ప్రమేయం ఏమీ లేదు అయితే ఫీజుల దోపిడీలో భాగంగా టీచర్ పైన యజమాని ప్రెషర్ పెట్టి నీవు ఏం చేస్తున్నావ్ ఫీజులు వసూలు చేయాలని ఇబ్బంది పెట్టడం వల్లనే ఆ టీచర్ ఇబ్బందికి గురై విద్యార్థిని  చితకాబాదింది. డీఈఓ  కూడా ఆమెను తొలగించినామని చెప్పడం కరెక్ట్ కాదు ఆమె ఏమైనా గవర్నమెంట్ టీచర్..? ఆమె తొలగించినామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ డి ఈ ఓ . కాబట్టి కలెక్టర్  తక్షణమే స్పందించి యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ పాఠశాల గుర్తింపు ను రద్దు చేయాలి అని అన్నారు.  ఆ స్కూల్ యజమాని అధిక ఫీజులు వసూలు చేస్తూ మరియు సరైన సౌకర్యాలు కూడా లేవు బాలికలకు సరైన టాయిలెట్స్ లెట్రిన్స్ కూడా లేవు.  దొంగ చాటున హాస్టల్ కూడా నడుపుతున్నాడు ఎంఈఓ  తనిఖీలు చేయడం లేదు.  కేవలం విద్యను వ్యాపారంగా చేస్తూ ఫీజులు పేరుతో విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  అర్హత లేని వారితో తక్కువ జీతాలు ఇచ్చి నాసిరకం విద్యను అందిస్తూ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు కావున తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333