కొండపాక మండలానికి నీటి విడుదల చేసిన కొమ్ము విజయకుమార్
తెలంగాణ వార్త కొండపాక:- తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలానికి నీళ్ళు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా SC డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ రైతులతో పాటు నీళ్లలో పసుపు కుంకుమ పూలు వేసి కొబ్బరి కాయలు కొట్టి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి మండుతున్న ఎండల్లో కూడా రైతులకు నీళ్ళు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు కొండా సురేఖ దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ TPCC అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. తమకు నీళ్ళు రావడానికి విజయ్ కుమార్ తో పాటు రైతులకు అండగా నిలడ్డ స్థానిక నాయకులు INTUC జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మారాబోయిన పార్శరాములు, BJP మండల కార్యదర్శి నల్ల మల్లేశం లను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా కార్యదర్శులు కుంచెం రవి, కొమ్ము భానుచంద్, రైతులు కుమార్, స్వామి, కనకయ్య , హరి, గణేష్, ముస్త్యాల నర్సింలు, వెంకటేష్, కిషన్,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.