కల్లుగీత కార్మికులకు నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు మంజూరు

Mar 13, 2024 - 19:28
 0  46
కల్లుగీత కార్మికులకు నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు మంజూరు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ కల్లుగీత కార్మికులకు నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు మంజూరు* KGKS సూర్యాపేట *జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు*. ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో నూతనంగా కల్లు గీత కార్మిక సహకార సంఘం లో 43 మందికి బుధవారం నాడు నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు *కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు* చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఈ గుర్తింపు కార్డులు ఉండటంవల్ల గీతా కార్మికులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రమాదకరానికి ఎక్స్గ్రేషియా తాడి కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయము ఆ కుటుంబానికి ఉపయోగపడుతున్నది. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి పెన్షన్ వర్తిస్తుంది ప్రభుత్వం నుండి గీత కార్మికులకు స్కీమ్ వర్తిస్తుంది అందుకనే ప్రతి గీత కార్మికుడు సభ్యత్వం కలిగి తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వము గీత కార్మికులకు 5 ఎకరాల భూమి ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియా వెంటనే ఇవ్వాలని గీతన్న బంధువు ప్రకటించి కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఇవ్వాలని గీత కార్మికులందరికీ ఉచితంగా బైక్లు ఇవ్వాలని గత రెండు సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని అరులైన వారందరికీ సభ్యత్వం గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలి తాటి ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ విధంగా కొత్త చట్టం తీసుకురావాలి గ్రామీణ ప్రాంతంలో బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలి మద్యనిషేధం దశలవర్గ అమలు చేయాలి వారానికి రెండు రోజులు లిక్కర్ డ్రైవ్ డే గా ప్రకటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కలుగత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి ఉయ్యాల నాగేష్ సొసైటీ అధ్యక్షులు చవుగాని మల్లయ్య సంఘం నాయకులు మడ్డి రాములు బుడిగ సత్తయ్య బుడిగ సైదులు మడ్డి మహేష్ కొండ మల్లయ్య కొండ గణేష్ వెలుగురి నరేష్ కొండ కాశయ్య కాట్ల వెంకన్న మడ్డి నాగరాజు మడ్డి గణేష్ జెర్రిపోతుల నాగరాజు కోల్లు మహేష్ నారగాని మహేందర్ చవుగాని మధు తదితరులు పాల్గొన్నారు.