కంప చెట్లను తొలగించండి.
జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణంలోని రెండవ రైల్వే గేట్ సమీపంలోని మాస్టర్ మైండ్ స్కూల్ దగ్గర కంపచెట్లు నిండిపోవడంతో విషపురుగుల సంచరిస్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. గతంలో ఇట్టి కంప చెట్టు తొలగించాలని న్యాయమూర్తి శ్రీ గణేష్ బాబు కూడా ఆదేశాలు జారీచేసిన నేటి వరకు మున్సిపల్ అధికారులు తొలగించ లేదని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.