ఐజ తైక్వాండో విద్యార్థిని విద్యార్థులకు బెల్టు ప్రధానం చేసిన రాష్ట్ర తైక్వాండో జనరల్ సెక్రటరీ మాస్టర్ కే శ్రీహరి

జోగులాంబ గద్వాల 13 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ. మండల కేంద్రంలోని బ్రైట్ స్టార్ హై స్కూల్ నందు నవదీప్ సాగర్ ప్రదీప్ సాగర్ టైక్వాండో క్లబ్బులో క్రీడను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు బెల్టు ప్రమోషన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. ఎగ్జామినర్ గా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో జనరల్ సెక్రెటరీ మాస్టర్ కే శ్రీహరి జోగులాంబ గద్వాల జిల్లా తైక్వాండో ప్రెసిడెంట్ మాస్టర్ షేక్షావలి ఆచారి ప్రియ శ్రీనివాస్ శెట్టి కే రవి ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో మంచిగా ప్రతిభ కనబరిచిన వారికి ప్రమోషన్ బెల్టులను కె శ్రీహరి చేతుల మీదుగా బెల్టులను ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్స్ మరియు ఐజ టైక్వాండో సీనియర్స్ k రమేష్ మాస్టర్, ప్రదీప్ సాగర్ నవదీప్ సాగర్ అంజి వెంకటేష్ సాయి మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.