ఏపూర్ చెరువు తుమును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Mar 11, 2025 - 19:04
Mar 11, 2025 - 19:18
 0  153
ఏపూర్ చెరువు తుమును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ చెరువు తుమును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు వృథా గా పోతున్న నీరు సమాచారం ఇచ్చినా పట్టించు అధికారులు.. మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్న చెరువు.. ఆత్మకూర్ ఎస్.. సాగునీటితోపాటు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆత్మకూరు మండలంలోని ఏపూరు శుభసముద్రం చేరువు కు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తూము ద్వంసం చేసి నీటిని వృధాగా తరలిస్తున్న సంఘటన ఆలస్యంగాలలోకి వచ్చింది. గత ఐదు రోజులుగా శుభసముద్రం చెరువు తూముకు ఉన్న తలుపులను ఇనుప ప్లేట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని మరి కారణంగా మీరు వృధాగా పోతుంది అని రైతులు మంగళవారం విలేకరులకు సమాచారం ఇచ్చారు. ఒకవైపు గోదావరి జలాలు సక్రమంగా అందక చెరువుల్లో నీరు లేక సాగునీటితో పాటు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో శుభసముద్రంలో కొద్దిపాటి నీటితో రైనా భూగర్భ జలాలు పోరాటనిస్తాయనుకుంటే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాపల కాంట్రాక్టర్లు శుభసముద్రం చెరువు తోమును ఇనుప తలుపులను రాత్రివేళల్లో ధ్వంసం చేసి నీటిని తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆచెరువు నీరు నేరుగా ఏట్లోకి వృధాగా వెళ్ళిపోతుందని రైతులు వాపోయారు. ఈవిషయమై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం ఇస్తున్నారని గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ గౌస్ ఆరోపించారు. తోమును వెంటనే మూసి వేయకపోతే మరో రెండు మూడు రోజుల్లో చెరువులో ఉన్న నీరు మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. *ఐ బి ఏఈ రామారావు వివరణ.* తూము తీసిన మాట వాస్తవమేనని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు తీసిన తూమును మా సిబ్బందితో పూడ్చివేశామని మళ్లీ రాత్రి వేళలో కొందరు తూము పగలగొట్టారని ఐబి ఏఈ రామారావు వివరణ ఇచ్చారు. తూము పగలగొట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి తూము మరమ్మతులు చేపట్టి నీళ్లను ఆపుతామని తెలిపారు.