దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలు తొలగించాలని EOకి వినతిపత్రం 

Mar 11, 2025 - 19:02
 0  6
దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలు తొలగించాలని EOకి వినతిపత్రం 

తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 11 : బిజెపివేములపల్లి మండలపార్టీ అధ్యక్షులు పెదమాం భరత్  ఆమనగల్ గ్రామంలోని పార్వతి జడ రామలింగేశ్వర దేవాలయం ఈవో ధనుంజయకు ఆలయం వద్ద వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపిమండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ సూర్యాపేట కిసాన్ మోర్చా జిల్లా ఇంచార్జ్ చల్లమల్ల సీతారాం రెడ్డి మాట్లాడుతూ ఎన్నో వేల చరిత్ర కలిగిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవాలయం ప్రాంగణంలో గత రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ ఫ్లెక్సీ తొలగించాలని డిమాండ్ చేశారు.  ఎన్నో సంవత్సరాల నుండి కూడా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారని ఇలా ఎప్పుడు కూడా దేవాలయం గుట్టపై అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు పెట్టలేదని  దేవాలయం ప్రాముఖ్యత తగ్గే విధంగా  రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు అని దేవాలయం చరిత్ర ప్రాముఖ్యత చాటి చెప్పే ఫ్లెక్సీలు బోర్డులు దేవాలయం గుట్టపై ఏర్పాటు చేయాలని  ఆలయ గోపురం కంటే ఎత్తులో ఎలా ఉంచుతారని కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతను భక్తిని ప్రశాంతతను విధంగా ఏర్పాట్లు చేయాలని  వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ కార్యదర్శి  పెదమాం ప్రసాద్, అమనగల్ గ్రామ బిజెపి అధ్యక్షులు చింతకాయల సైదులు, గ్రామ నాయకులు పురుషోత్తమ్, మహేష్, శివశంకర్, లింగయ్య పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333