ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సి.ఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభాస్థలిని పరిశీలించిన.
రాష్ట్ర ఎక్సేంజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య.
వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి.
జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ.
గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్.
జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- నాగర్కర్నూల్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో నిర్వహించే బారీ బహిరంగ సభ కు ఈనెల 5వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాకు విచ్చేస్తున్న ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరవుతున్న ఎర్రవల్లి చౌరస్తాలో సభాస్థలిని రాష్ట్ర ఎక్సేంజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య,వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి... పరిశీలించారు... అనంతరం వారు మాట్లాడుతూ మే 5న నడిగడ్డలో జరిగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బారీ బహిరంగ సభ విజయవంతం చేయుటకు జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు....