పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహనే ఫ్లాగ్ మార్చ్:ఎస్సై చంద్రకాంత్
జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-మానవపాడు: శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా ఎస్పీ రితురాజ్ ఆదేశాల మేరకు మానవపాడు మండలంలోని కొర్విపాడు గ్రామంలో ఐటిబిపి బలగలు మరియు మండల ఎస్సై ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై చంద్రకాంత్ మాట్లాడుతూ.రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శక, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ధైర్యాన్ని కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది,ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కూడిన ఐటిబిపి సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఐటిబిపి ఇన్స్పెక్టర్ కైలాస్ రామ్, మండల పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.