ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్

Feb 16, 2024 - 16:24
Feb 16, 2024 - 17:35
 0  47
ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్

జోగులాంబ గద్వాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల  పట్టణం లో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం లో శుక్రవారం లంచ్ టైంలో నిరసన కార్యక్రమం చెపట్టారు. ఇట్టి కార్యక్రమంలో బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి భంగి రంగారావు మాట్లాడుతూ...నేడు యావత్ భారత దేశంలో కార్మిక కర్షకులు అంతా స్వచ్ఛందంగా గ్రామీణ భారత్ బంద్, సెక్టోరల్ వారిగా సమ్మెల కు పిలుపునిచ్చి దాని దిగ్విజయానికి తీవ్ర కృషి చేస్తున్నారు. గ్రామీణ బంధు పిలుపు సఫలం కాకూడదని కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, సమ్మెకు దిగుతున్న వారిని బెదిరిస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారు. పంజాబ్ నుండి ఢిల్లీకి బయలుదేరిన రైతన్నలను అడ్డుకుంటున్న తీరు ఏ దేశ ప్రజాస్వామాన్ని పరిహసించే విధంగా ఉన్నది.తమ నిరసనలు తెలపడానికి వస్తున్న రైతులను ముండ్లకంచెలతో, పెద్ద పెద్ద బార్కెట్లతో, రోడ్ల పైన మేకులు కొట్టించి, మొలలు నాటి, కాంక్రీట్ తో గోడలు నిర్మించి ఆటంకాలు సృష్టిస్తున్న తీరు ఇరదేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం తలపిస్తున్నది. నిరసన గలమే లేకపోతే ప్రజాస్వామ్యం రాచరిక వ్యవస్థ కన్నా చాలా ప్రమాదకరంగా మారుతది. తమకు ఎదురులేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రైతన్నలు మెడలు వంచి క్షమాపణలు చెప్పించి పార్లమెంట్ చేత ఆమోదించబడిన బిల్లులను వెనక్కి రప్పించిన ఘనత రైతుల ఐక్యత శక్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది అని రంగారావు గుర్తు చేశారు.ఈ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉపాధి పొందుతున్నది వ్యవసాయ రంగం. స్కూల్లో జాతీయ ఉత్పత్తిలో దాని 20 శాతం కూడా లేదని తెలిసినా దిక్కుతోచని స్థితిలో వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకున్న దుస్థితి ఉన్నది. వ్యవసాయ రంగంలో పాలుపంచుకుంటున్న వారందరికీ మెరుగైన జీవన విధానం ఏర్పడుతుంది. దీనిని పెడచెవిన పెడుతున్న దృష్ట్యా ప్రభుత్వాలను హెచ్చరిక చేయడం నేటి అవసరం. అందుకే ఫిబ్రవరి 16న జాతీయస్థాయిలో గ్రామీణ బంధు విజయవంతం కావడం సానుకూల ఫలితాలకు నాంది పలుకుతుంది. రైతు సంఘాలతో పాటు కేంద్ర కార్మిక సంఘాలన్నీ సెక్టార్లవారీగా అనేక రంగాల్లోనే కార్మికులందరూ కూడా ఈ గ్రామీణ బందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. అసంఘటితంగా ఉన్నటువంటి 96% కార్మికులంతా అత్యంత తక్కువ వేతనాలతో, పోరగాని  సౌకర్యాలతో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు.ఏ సమాజంలో నైతే శతకోటీశ్వర్లు బిలియనీర్లు సంఖ్య కన్నా లక్ష్యాధికారులు కోటీశ్వరుల సంఖ్య అత్యధిక శాతం పెరిగితే అది మెరుగైనదిగా భావించవచ్చ. కానీ భారతదేశంలో బిలీయనీర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయి ఒక్క శాతం ప్రజల దగ్గర సంపద పోగవుతున్నది.కార్మిక వర్గం కన్నెర వేసి గ్రామీణ భారత్ బంద్ లో భాగస్వాములై తమ బతుకులను బుగ్గిపాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాయి రెండేళ్లకు పైబడి దేశ రైతన్నలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా తాత్పర్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి తక్షణమే రైతన్నల హామీలను అమలు పరచాలని, ఎన్ పి ఎస్ ను రద్దు చేయాలని ఓపిఎస్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంను కోరుతున్నట్టు ప్రధాన కార్యదర్శి రంగారావు కోరారు. ఇట్టి కార్యక్రమంలో సురాజ్ వంశీధర్ రెడ్డి, రాఘవేంద్ర, కిషోర్, పద్మావతి, పద్మా, రంగయ్య, సుదర్శన్ శెట్టి, శేఖర్, మల్లికార్జున్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇట్టి భోజన విరామ సమయంలో నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333