గద్వాల నూతన  డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన కే సత్యనారాయణ

Feb 16, 2024 - 16:25
Feb 16, 2024 - 17:40
 0  174
గద్వాల నూతన  డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన కే సత్యనారాయణ

జిల్లా ఎస్పీ ను మర్యాదపూర్వకంగా కలిసి డిఎస్పీ.

జోగులాంబ గద్వాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల ఫిబ్రవరి 16:- రాష్త్ర వ్యాప్త బదిలీలలో భాగంగానే జిల్లా కు డిఎస్పీ గా వచ్చిన కె.సత్యనారాయణ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ రితిరాజ్ ను పూల మొక్క తో మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించే దిశగా హామీ ఇస్తూ బాధితులకు ధైర్యాన్ని కల్పిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎటువంటి పెండెన్సీ లేకుండా చూడాలని, త్వరితగదగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... గద్వాల జిల్లా పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రతి మండల పరిధి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేపడతామని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333