విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి

జెడ్పి చైర్ పర్సన్ సరిత

Feb 16, 2024 - 16:15
Feb 16, 2024 - 17:34
 0  71
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి

పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెడ్పి చైర్ పర్సన్.

జోగులాంబ- గద్వాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త  ప్రతినిధి:- గద్వాల విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి అని జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు.శుక్రవారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఆకస్మిక తనిఖీ చేశారు.పాఠశాలలో చదువుచున్న విద్యార్థులతో కలిసి కొంతసేపు ఉపాధ్యాయురాలిగా సరితమ్మ బోధించి, పాఠ్యాంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకుని, ఉపాద్యాయులు విద్యా బోధన ఏవిధంగా బోధిస్తున్నారని తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు..అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అభ్యసించాలని ఉపాధ్యాయులకు సరిత సూచించారు. ప్రైవేటు కు దీటుగా విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతిలో అవకతవకలు లేకుండా, నాణ్యమైన భోజనం మోను ప్రకారం అందించాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరించాలని జెడ్పి చైర్ పర్సన్ ఉపాధ్యాయులకు ఆదేశించాడు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333