ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య
ఏపీ, తెలంగాణ వార్త ప్రతినిధి::ఎన్టీఆర్ జిల్లా/ నందిగామ టౌన్ : 26 అక్టోబర్ 2024
నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు మద్దతుగా శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ను మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకొని నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల పనులు చక్కగా జరుగుతున్న తీరును తంగిరాల సౌమ్య గారికి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం మాపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అందులో భాగంగానే ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థిగా మంచి వ్యక్తి,విద్యావేత్త ఆళ్ళపాటి రాజేంద్రప్రసాద్ గారిని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం చాలా సంతోషం. రాజా గారు చాల మృదుస్వభావి,సౌమ్యులు చాలా పట్టుదలతో పని చేసే వ్యక్తి. నందిగామ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 2500 ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమము పూర్తి చేసుకోవడం జరిగినది. ఈ రోజు ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు మద్దతుగా విచ్చేసిన రాష్ట్ర మాజీ సైనికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఓటరు నమోదు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలనీ పార్టీ క్యాడర్ కు తంగిరాల సౌమ్య సూచన చేసారు..