ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం...పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి నో ! 

Nov 9, 2024 - 15:02
 0  18
ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం...పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి నో ! 

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ పెద్ద ధన్వాడలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రైతులతో కలిసి నిరసన తెలిపారు.పర్యావరణం, ప్రజారోగ్యానికి హానికరమని, సారవంతమైన భూములు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి, ప్రజాభిప్రాయం లేకుండా ఫ్యాక్టరీకి అనుమతులివ్వడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితుల, చిన్నదన్వాడ గ్రామస్థుల భూములు ఫ్యాక్టరీ పరిధిలోకి రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "అలంపూర్ ప్రజలను కాపాడుకోవడం నా బాధ్యత" అని స్పష్టం చేశారు. బిఆర్ఎస్వి   కో-ఆర్డినేటర్ పల్లయ్య, స్థానిక నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333