ఆజింపేట గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ కు ఘన నివాళులు

అడ్డగూడూరు 18 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజింపేట గ్రామంలో గౌడ సంఘ సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.సంఘం అధ్యక్షులు బొమ్మగాని సైదులు గౌడ్ ఉపాధ్యక్షులు లింగాల యాదగిరి గౌడ్,మాజీ అధ్యక్షులు నిమ్మల ఈశ్వర్ గౌడ్,ఆ గ్రామ గౌడ సంఘ నాయకులు నిమ్మల మొగులయ్య గౌడ్,దశరథ గౌడ్, లింగాల రామస్వామి గౌడ్,నిమ్మల నరసింహ గౌడ్,తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.