ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు

Apr 15, 2024 - 19:43
 0  5
ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు
ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్

సూర్యాపేట ప్రతినిధి :- ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు సోమవారం సీతారామ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొని మాట్లాడారు.  కుందూరు రఘువీరారెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీ ఎలక్షన్లో లక్ష నలభై వేల ఓట్లతో గెలిపించుకోవాలని అన్నారు. అలాగే 17 ఎంపీ సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వమే కైవసం చేసుకుని బిజెపికి, టిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిందని, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, మహిళలకు వడ్డీ లేని రుణాలను,  వచ్చే రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలను ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు.

  ఎన్ ఎస్ యు ఐ, యువత ఎంపీ ఎలక్షన్లో ముందు ఉండి విస్తృత ప్రచారం చేయాలని, అధిక మెజార్టీతో గెలిపించాలని, ఎన్ ఎస్ యు ఐ లో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి తగిన గుర్తింపు ఉంటుందని, నేను కూడా ఎన్ ఎస్ యు ఐ నుంచి ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వంమె అని, మన కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజార్టీతోని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ నియోజకవర్గ  ప్రెసిడెంట్ బంధం విష్ణు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజబోయిన శ్రీకాంత్, టౌన్ ప్రెసిడెంట్ చింత నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333