ప్రజావాణి కార్యక్రమం.. నేటి కార్యక్రమానికి 12 పిర్యాదులు.
పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ గారు.
- మహిళలపై వేదింపులకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పి.
సూర్యాపేట :- శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే ఐపిఎస్ గారు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 12 పిర్యాదు వచ్చినాయి, వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన అర్జిలను , జిల్లా ఎస్పీ గారు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం, మహిళల పట్ల వేదింపులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. చట్టాలను లోబడి ప్రతి పౌరుడు నడుచుకోవాలి, చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు అన్నారు.