ఎన్నుమరేషన్ పత్రాలను తిరిగిచ్చేందుకు మూడు రోజులే గడువు.

Aug 1, 2026 - 00:49
 0  2
ఎన్నుమరేషన్ పత్రాలను తిరిగిచ్చేందుకు మూడు రోజులే గడువు.

ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఓటరు సహకరించాలి.

బిఎల్ఓలు, ఇతర అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి.

జిల్లాలో 86.08 శాతం డిజిటలైజేషన్ పూర్తి. 

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల31 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.

 గద్వాల.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటింటికి ఎన్నుమరేషన్ పత్రాలను ఇవ్వడం జరిగిందని, పూరించిన ఫామ్స్ తిరిగిచ్చేందుకు మూడు రోజులే గడువు ఉన్నందున ఓటర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. 

శుక్రవారం కలెక్టర్ ఐడిఓసి లోని తన చాంబర్ లో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిర్వహిస్తుందని, దాంతో ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు  బిఎల్ఓలు, సంబంధిత అధికారులు సహకరించాలన్నారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 86.08 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో ధరూర్ మండలంలో 85.59, గద్వాల రూరల్ లో 88.21, గద్వాల అర్బన్ లో  70.07, గట్టులో 89.62, కేటీ దొడ్డిలో 88.61, మల్దకల్ లో 90.28 శాతం డిజిటలైజేషన్ జరిగిందన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో ఆలంపూర్ మండలంలో 89.76, ఐజలో 91.95, ఇటిక్యాలలో 90.52, మానవపాడులో 90.37, రాజోలిలో 87.95, ఉండవెల్లిలో 90.72, వడ్డేపల్లిలో 86.79, ఎర్రవల్లి మండలంలో 87.33 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. జిల్లాలో 62062 మంది ఓటర్లు ఇంకా తమ ఎన్నిమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేదని, వీరంతా ఓటు హక్కు కోల్పోరాదంటే నిర్దేశిత గడువులోగా తమ పరిధిలోని బిఎల్ఓలకు పూరించిన పత్రాలను ఇవ్వాలన్నారు. జిల్లాలో యుఈఎఫ్ (అన్ కలెక్టబుల్ ఎన్నుమరేషన్ ఫార్మ్స్) శాతం 12.32 ఉందన్నారు. మొత్తం డీఎస్ఈ (డెమోగ్రాఫికల్ సిమిలరీ ఎంట్రీ) ఓట్లు 7740 ఉండగా, ఏఎస్ డి (ఆబ్సెంట్ షిఫ్టెడ్ డబుల్) 3683 ఓట్లు ఉన్నాయన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జులై 24వ తేదిన ఇంటింటి సర్వే పూర్తి చేయాల్సి ఉండగా ఓటర్లు తమ పూరించిన ఎన్నుమరేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో గడువును ఆగస్టు మూడవ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, వాలంటీర్లు పత్రాలను పూరించడంలో అవగాహన లేని ఓటర్లకు సహకరించినప్పటికీ ఇంకా కొంతమంది తిరిగి ఇవ్వకపోవడం వలన తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ కు సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి కోరడం జరిగిందన్నారు. ఆగస్టు మూడవ తేదీ లోగా ఎన్నికల అధికారులు, వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని రాజకీయ పార్టీల ఏజెంట్లు జిల్లాలో వంద శాతం డిజిటలైజేషన్ జరిగేందుకు తమ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఓటర్లందరూ ఎన్నుమరేషన్ పత్రాలను ఫిలప్ చేసి ఇచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, దగ్గరుండి ప్రక్రియను పూర్తి చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు తమ ఓటు హక్కును కోల్పోకుండా సద్వినియోగం చేసుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఇప్పటికే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించడమే కాక వివిధ సందర్భాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ఎన్నిమరేషన్ పత్రాలను పూరించి తిరిగిచ్చిన ఓటర్లు, బిఎల్ఏలు తమ ఇరుగుపొరుగు ఎవరైనా ఇవ్వకుంటే సామాజిక బాధ్యతగా వారు ఓటు హక్కును పొందేందుకు వీలుగా తమ వంతుగా అవగాహన కలిగించి సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333