మున్సిపల్ చైర్మన్ హౌస్ అరెస్ట్

Sep 5, 2026 - 15:59
 0  213
మున్సిపల్ చైర్మన్ హౌస్ అరెస్ట్

  తిరుమలగిరి 05 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటనలో భాగంగా తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ    6 గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలకు అమలు చెయ్యకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన దానిని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రారంభించడానికి వస్తున్నాడు..., ఈ సందర్భంగా మమ్మల్ని హౌస్ అరెస్టు చెయ్యడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం అన్నారు..., కాంగ్రెస్ సర్కారు కు దమ్ముంటే 6 గ్యారెంటీ లు అమలు చేయాలని అన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి