ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే తెలంగాణ వీరులకు నిజమైన నివాళి...
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన...
జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి కార్యవర్గ సభ్యులు...
జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజని, తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసిసి జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ,హక్కులు,ప్రజాస్వామ్య విలువల కోసం ఎంతోమంది వీరులు పోరాడారని తెలిపారు.వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీలు శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, నర్సిరెడ్డి,మధు నాయుడు,నరేందర్,ఎండి. మోయిన్, వీరేష్, దర్శల్లి ఆంజనేయులు, జిల్లా ఓబీసీ సెల్ నాయకులు కొండల్, రాఘవేంద్ర గౌడ్, ములింటి నరసింహ,ఉప్పేరు రవి తదితరులు పాల్గొన్నారు.