ఆయిల్ పామ్ తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ సహకారం అందిస్తాం

Sep 10, 2026 - 20:25
 0  1
ఆయిల్ పామ్ తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ సహకారం అందిస్తాం

జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య 

సూర్యాపేట సెప్టెంబర్ 10 : ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయిల్ ఫామ్ రైతు సంఘం  ప్రతినిధులు,ఆయిల్ ఫెడ్ అధికారులు, ఉద్యాన శా అధికారులు, డ్రిప్ కంపెనీ సిబ్బంది తో  సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో సూర్యాపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తున్న రైతులతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారి అభ్యర్థన మేరకు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు పలు డిమాండ్ లను జిల్లా ఉద్యాన అధికారి కి విన్నవించారు. రైతుల డిమాండ్లను పై అధికారులకు తెలియపరిచి వాటిని పరిష్కరించెందుకు  కృషి చేస్తామన్నారు. ఎఫ్ ఎఫ్ బి పేమెంట్ విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరగకుండా సంబంధిత అధికారుల చొరవతో వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూస్తామన్నారు.. జిల్లా లో ఉన్న ఆయిల్ ఫామ్ సిబ్బంది  కొరతను త్వరలో తీర్చి రైతులకు సూచనలు సలహాలు అందేలా సమన వయంతో పనిచేస్తామన్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకొని పెద్ద మొత్తంలో రైతులు ఆయిల్ ఫామ్ చేసే సాగు చేసే విదంగా రైతు సంఘం నాయకులు తమ వంతుగా కృషి చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమం లో ఉద్యాన సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్, ఉద్యాన అధికారులు కట్ట స్వాతి, పి అనిత, ఎల్ ప్రదీప్తి, వి ప్రమిత, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ అలీమ్,  ఎం ఐ ఇంజనీర్ నరేష్,ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు మన్నెం సదా శివారెడ్డి, బ్రహ్మ రెడ్డి, తూముల ఇంద్ర సేనా రావు,  మల్లెల నాగి రెడ్డి, మహానంద రెడ్డి, బాబురావు, వెంకటేశ్వర్ రెడ్డి తో, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ లు, డ్రిప్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333