గూడెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ధ్వంసమైన ఇల్లు

Sep 9, 2026 - 19:33
 0  1
గూడెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ధ్వంసమైన ఇల్లు

09-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో తెల్లవారుజామున అందాద నాలుగు గంటల ప్రాంతంలో అంబయాల బిచ్చన్న ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగ ధ్వంసం అయింది. ఇంటి యజమాని అయిన బిచ్చన్న గారికి శరీరం చాలావరకు కాలింది. తక్షణమే అంబులెన్స్ సహకారంతో కుటుంబీకులు  వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చిబాధిత కుటుంబాన్ని పరామర్శించినడు.

ప్రమాద విషయం తెలుసుకున్న చిన్నంబావి మండల మాజీ జడ్పిటిసి వెంకట్ రమణమ్మ చిన్నారెడ్డి, మరియు గుమ్మడం సత్యనారాయణ, గుమ్మడం విష్ణుకుమార్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బిచ్చన్నను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని డాక్టర్ దగ్గర మాట్లాడి బిచ్చన్నకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వెంకట్ రెడ్డి అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

 వీరి వెంట దైపు శివ, గొందిపర్ల స్వామి, అంబయ్యల గారి కురుమయ్య, బిచ్చన్న గారి స్నేహితులు పరామర్శించారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State