అయిజ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల పరిశీలన.
జోగులాంబ గద్వాల 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డా. సంధ్యా కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, ల్యాబొరేటరీ, వ్యాక్సినేషన్, ఎన్‌సీడీ, ప్రసవ సేవలను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సేవలకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆమె వెంట ఎస్‌ఓ తీర్మల్‌రెడ్డి, డీపీఎచ్‌ఎన్‌ఓ వరలక్ష్మి ఉన్నారు.