చిన్నపాటి వర్షానికి చిత్తడి చిత్తడిగా.

లీ కేజీల ను పట్టించుకోని అధికారులు.

Aug 1, 2026 - 00:51
 0  3
చిన్నపాటి వర్షానికి చిత్తడి చిత్తడిగా.
చిన్నపాటి వర్షానికి చిత్తడి చిత్తడిగా.
చిన్నపాటి వర్షానికి చిత్తడి చిత్తడిగా.

గులాంబ గద్వాల 31 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు అనుకున్నంతగా కురువకపోవ డం. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీళ్లు నిలువచేరి పరిసరాలు చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల వెంబడి తిరిగే వాహనదారులకు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ మార్గ రోడ్డుకు. కొత్త బస్టాండ్ సమీపంలో. తదితర ప్రాంతాల్లోని ఈ దుస్థితి కనబడుతుంది. రాజీవ్ మార్గం వెళ్లే రోడ్డుకు లీ కేజీలు ఉన్నట్ల? మురికి నీళ్లు. వాహనదారులకు తీవ్ర సమస్యగా మారింది. ఇలాగా అనేక రోడ్ల ప్రక్కలకు గుంతల్లో నిల్వచేరి అపరిశుభ్రతకు దర్శనంగా మారింది. డ్రైనేజీలు పరిసరాలు ప్రభావంతో అంటువ్యాధులు. సీజనల్ రోగాలకు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల లోని మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడ లేదని విమర్శలు ఉన్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసిన కౌన్సిలర్లకేషనర్ స్పందించకపోవడం గర్వకారణం. ఎక్కడ సమస్యలు ఎక్కడ మూలుగుతున్న అధికారులు నిర్లక్ష్యమూలంగా సమయాన్ని వృధా చేస్తున్నారు గాని అభివృద్ధి పనులు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం కొనసాగుతుంది. ఈగలు. దోమలు వ్యాప్తి చెందెందుకు అవకాశం మెండుగా ఉంది. మురికి నీరు నిల్వ చేరడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ. పట్టణ ప్రజలకు అనారోగ్యాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిసరాలపై దృష్టి కేంద్రీకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333