ఉదండాపురం లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండలంలోని ఉదండాపురం గ్రామపంచాయతీ ఆవరణ నందు సర్పంచ్ గొల్ల మహేష్ & ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం / ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గొల్ల మహేష్. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. సర్పంచ్ మహేష్ చేతుల మీదుగా విద్యార్థినులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత అంటే 1948, సెప్టెంబర్ 17న తెలంగాణలో నిజాం రాజుల పాలన అంతమయ్యిందని, ప్రజల సాయుధ పోరాటం, ఆర్మీ ఆపరేషన్ పోలో ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని గ్రామ ప్రజలకు వివరించారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు వార్డ్ మెంబర్లు యువకులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.