తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం లో
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.
జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల తెలంగాణ ప్రజా పాలన దినోత్సవo ను పురాష్కరించుకొని గురువారం ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి. జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ అధికారులకు, సిబ్బందికి మరియు మండల ప్రజలందరికి “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేస్తూ,1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలోనే కొనసాగిందని, అనంతరం కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో విజయవంతమైన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రసంగంలో హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం అయినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే ఈ రోజును “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజా పాలన యొక్క ప్రాముఖ్యత, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మనోహర్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్ మోహన్, జిపిఓ లు,పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు. చాగాపురం గ్రామపంచాయతీ ఆవరణ నందు జాతీయ పతాక ఆవిష్కరించిన చాగాపురం సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి రవి గౌడ్, ఉప సర్పంచ్ పరుశరాముడు, వార్డ్ మెంబర్ రామకృష్ణ, ఇటిక్యాల మండలం కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అల్లబకాస్, గ్రామ పెద్దలు యువకులు తదితరులు ఉన్నారు. ఇటిక్యాల గ్రామపంచాయతీ ఆవరణ నందు జాతీయ పతాక ఆవిష్కరించిన.సర్పంచ్ జివేందర్ రెడ్డి. ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి హెల్త్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. వావిలాల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణ నందు జాతీయ పతాక ఆవిష్కరించిన ఉపసర్పంచ్ & ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు గ్రామ పెద్దలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు యువకులు నాయకులు ఉన్నారు.