విద్యార్థులు నిరుద్యోగులు విజృంభిస్తే విప్లవ పోరాటాలు ఉరకలెత్తుతాయి రేవంత్ రెడ్డి
జంగు సైరన్ మోగించిన గులాబీ దండు విద్యార్థులు నిరుద్యోగులు యువత
అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
జోగులాంబ గద్వాల 5సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అలంపూర్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు.. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి” – ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు., “హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు” – మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్.విద్యార్థులను నిరుద్యోగులను గారడి మాటలతో మోసగించిన డోఖాబాజీ రేవంత్ రెడ్డి సర్కార్..BRSV జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
“6 గ్యారంటీలు ఎక్కడ? 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై అయిజ పట్టణ కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు & విద్యార్థులు భారీగా నిరసన ర్యాలీ!”
అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ బి ఆర్ ఎస్ పార్టీ గులాబీ దళం చేపట్టారు,
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ,అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు ఆదేశాలతో అయిజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్ మరియు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ర్యాలీలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు ... ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండటంతో వారి చదువులు, భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న ఆర్ గ్యారంటీలలో ఒకటి కూడా అమలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో ఎన్నికలలో ప్రజలు సరైన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మాస్టర్ మధు మాట్లాడుతూ ఎన్నికలకు ముందర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూటీలు ఇస్తామని తప్పుడు హామీ ఇచ్చింది, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలను వెంటనే అమలు చేయాలి లేకుంటే విద్యార్థులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సరైన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.