ఎంబిబిఎస్ వైద్య కళాశాలలో సీట్ సాధించిన విద్యార్థులను

సన్మానించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,
చిన్నంబావి మండలం 25సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త : కొల్లాపూర్ మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ కురుమయ్య కుమార్తె బి.అరుంధతి కి నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల లో సీట్ రావడం జరిగింది.వారి ఇంటికి వెళ్లి అరుంధతిని శాలువ కప్పిఅభినందించి సన్మానించారు.వీపనగండ్ల మండల కేంద్రంనికి చెందిన ఆకుపోకల రాజు వెంకటేశ్వరమ్మ కుమార్తె అఖిల కి వనపర్తి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల లో సీట్ వచ్చింది వారిని అభినందించి సన్మానం చేశారు.భవిషత్తు లో కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు సేవ చెయ్యాలని వారిని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పేద ప్రజలకు వైద్య విద్య అందించడానికి మెడికల్ కాలేజీలు నిర్మించారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.