వికలాంగుల 6వెలు పెన్షన్ పెంచేది ఎప్పుడో

కొత్త పింక్షన్స్ ఎప్పుడు మంజూరు అయితయ్

Nov 20, 2024 - 17:25
 0  3
వికలాంగుల 6వెలు పెన్షన్ పెంచేది ఎప్పుడో

రామన్నపేట 20 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టుర్:- రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో వికలాంగుల హక్కుల గురించి సమావేశమయ్యారు.పెన్షన్ పెంపు కోసం నవంబర్ 20 నుండి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంనవంబర్ 25 న కలెక్టరేట్ ఆఫీస్ ముందు మహా ధర్నా వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచాలని, పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్స్ మంజూరు చేయాలని నవంబర్ 20 నుండి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమం చేస్తామని తెలిపారు.డిసెంబర్ 25న కలెక్టరేట్ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహిస్తుమని ఎన్ టి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు. బుధవారం రోజు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్ పిఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఈ సందర్బంగా  మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచుతామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్ 4000లకు పెంచుతామని హామీ ఇచ్చినారని, అధికారంలోకి వచ్చి 11నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు.  ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలావెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి, వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయూలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి బడ్జెట్ లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.సదరం సర్టిఫికెట్స్ రిజెక్ట్ అయినా వారికి సర్టిఫికెట్స్ పునరుద్దరించాలని. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ,2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెంక్షన్ పెంపు కోసం క్యంపియన్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నుండి 24 వరకు గ్రామాల్లో ప్రచారంచేసి గ్రామ కార్యదర్శులకు పత్రాలు ఇవ్వడం జరుగుతున్నవి 
నవంబర్ 25న కలెక్టర్ కార్యాలయల ముట్టడి జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండలం నాయకులు మంగ శ్రీను మండల నాయకులు తాటిపాముల జంగయ్య గ్రామ నాయకులు పెండం జానీ,జినుక మహేష్,కే బిక్షమయ్య, గజం ప్రసాద్, తాటిపాముల అంజమ్మ,నరసింహ,బి రాకేష్ రెడ్డి,బి వెంకటరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333