తాడ్వాయి గ్రామంలో ఇంచుట సర్వే చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది
మునగాల 30 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :-సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేపాల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ శ్రీశైలం అన్నారు. మండలం లో తాడ్వాయి గ్రామంలో ఆదివారం రేపాల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో విష జ్వరాలు ప్రబలకుండా ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ గ్రామంలో ప్రతి వార్డుల్లో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ మూడు నెలల పాటు ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.జ్వరాలు ప్రధానంగా దోమల ద్వారా ప్రబలుతాయని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని ముఖ్యంగా ఉపయోగంలో లేని పడవేసిన తొట్లు, డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొద లగు వాటిలో వర్షపు నీరు చేరి దోమల ఉత్పత్తి జరుగుతాయని వాటిని తొలగిం చాలని అన్నారు.శనివారం రాత్రి దోమల నివారణకు మాలాతీయాన్ ద్రావణంతో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వినయ్ కుమార్, వైష్ణవి, జాతీయ కీటక జనీత నివారణ ప్రోగ్రాం సబ్ యూనిట్ ఆఫీసర్ లు ఎం సుదర్శన్, షాబుద్ధిన్,హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ, ఏఎన్ఎంలు సుచరిత, మమత, ఆరోగ్య కేంద్రం ఆశ వర్కర్లు అందరూ , మలేరియా ఫీల్డ్ వర్కర్లు ,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.