ఉపాధి పనులు తనిఖీ చేసిన డి ఆర్ డి ఓ పి డి

Feb 27, 2024 - 19:55
Feb 28, 2024 - 00:00
 0  138
ఉపాధి పనులు తనిఖీ చేసిన డి ఆర్ డి ఓ పి డి

 తెలంగాణవార్త ఆత్మకూరు యస్    ఉపాధి పనులు తనిఖీ చేసిన డీఆర్డీఓ.పి డీ* ఆత్మకూరు ఎస్.. మండలపరిధిలో నీమంగలి తండా నెమ్మీకల్ గ్రామాలలో జిల్లా గ్రామీన అభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు .ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల పనిని పరిశీలించారు . ఎన్పీసీఐ కు కూలీల బ్యాంక్ అకౌంట్లను ఆధార్ సీడింగ్ చేసి పేమెంట్లు త్వరగా అయ్యే విధంగా చూడవలసిందిగా ఆదేశించినారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి 75 మంది కూలీలు తక్కువ కాకుండా పనులు కల్పించవలసిందిగా ఆదేశించినారు అనంతరం మంగళ్ తండా మరియు నేమ్మికల్ నర్సరీలను సందర్శించారు నర్సరీలకు సంబంధించ షేడ్ నెట్ వెంటనే ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న బ్యాగులను పండ్ల మొక్కలు పెంచుటకు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు వారి వెంట జిల్లా సీఈఓ అప్పారావు ఎంపీ ఓ సంజీవయ్య, ఈసీ అరుణ జ్యోతి పంచాయతీ కార్యదర్శి రవీందర్, సాంకేతిక సహాయకులు అఖిల. తదితరులు ఉన్నారు.