కేజీబీవి ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. డిటిఎఫ్

Jul 5, 2025 - 02:30
 0  12
కేజీబీవి ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. డిటిఎఫ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కేజీబీవి ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. డిటిఎఫ్ ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కేజేబీవి ఉపాధ్యాయుల కు దాదాపు మూడు నెలలుగా జీతాలు అందక అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే వారి జీతాలను విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చర్ల వేణు డిమాండ్ చేశారు ఈరోజు ఆత్మకూరు మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ సభ్యతలను సేకరించే కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగింది. వారి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని మాట్లాడుతూ సమ్మె కాలానికి రావాల్సినటువంటి వేతనాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడం అదే రకంగా మూడు నెలల వేతనాలు రాకపోవడంతో అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్న ఉపాధ్యాయులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వెంటనే వారి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఉపాధ్యాయులకు రావలసినటువంటి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లెద్దు వెంకన్న, రాష్ట్ర కౌన్సిలర్ యోగానంద చారి,నాగార్జున, సుధాకర్ రాజశేఖర్ మొదలైన వారు పాల్గొన్నారు