విశ్వ వ్యాధి,పాండు రోగం,కంచిక వ్యాధికి ఉచిత సేవ...
దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప..

జోగులాంబగద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాజోలి. మండలంమాన్దొడ్డి గ్రామంలో దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప (విశ్వవ్యాధి) (పాండు రోగం) (కంచిక వ్యాధి) నిర్మూలనకు గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోగులకు ఉచిత సేవలు అందించడానికి (24) గంటలు సేవలందించడానికి నేను అందుబాటులో ఉంటానని మీడియాకు తెలియజేశారు. ఈసందర్భంగా ఒకబాలిక మాట్లాడుతూ.... ,బెంగుళూరు, హైదరాబాద్ ఇంకా చాలా ఆసుపత్రులకు తిరిగి మందులు వాడిన ఫలితమురానిది, దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప స్వామి ఇచ్చిన చికిత్సవలన నయం అవ్వడం జరిగిందని బాలిక తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తనకుచేయూతను అందిస్తే చికిత్సపట్ల తనకు ఉన్న అపార అనుభవాన్ని జోడించి వ్యాధిగ్రస్తులకు అంతా బాగు చేస్తానని దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప తెలియజేశారు.