ఉచిత వైద్య శిబిరము నిర్వహణ

Nov 19, 2024 - 17:10
Nov 19, 2024 - 17:14
 0  16
ఉచిత వైద్య శిబిరము నిర్వహణ

జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఈనెల 22వ తేదీ (శుక్రవారం) ఉచిత చిన్నపిల్లల గుండె వ్యాధుల వైద్య శిబిరము నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి సిద్ధప్ప ఒక ప్రకటనలో తెలిపారు. హృదయ ఫౌండేషన్ హైదరాబాద్ వారు గద్వాల పట్టణంలోని దూద్ దవాఖానా (కేశమ్మ మెమోరియల్ ఆసుపత్రి) లో నిర్వహించబడుతుందని,  ఈ శిబిరము NMDC( నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో 0-16 సంవత్సరాల పిల్లలకు గుండె సంబంధ పరీక్షలు నిర్వహించబడును అవసరమైన వారికి 2D ECHO పరీక్షలు ఉచితంగా చేయబడును. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా  వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప   ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9121276741 పద్మాకర్ రావు ను సంప్రదించాలన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333