రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్

Nov 19, 2024 - 17:13
Nov 19, 2024 - 17:14
 0  11
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలి
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలి

తెలంగాణ వార్త:- గద్వాల  పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.మంగళవారం ఉండవల్లి శివారులోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మితంగా తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లులో రైతులు తెచ్చిన పత్తి నాణ్యతను పరిశీలించారు.ప్రత్యేకంగా పత్తి తేమ శాతాన్ని తేమమీటర్ ద్వారా తనిఖీ చేశారు. రైతులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలు కేంద్రాలకు పత్తిని ఆరబెట్టి తీసుకొని వస్తే గిట్టుబాటు ధర లభిస్తుంది అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ పెరగకుండా  రైతులకు టోకెన్లు జారీ చేయాలని, టోకెన్‌లో సూచించిన విధంగా ఆయా తేదీలలో మాత్రమే రైతులు మిల్లులోకి అనుమతించి కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, సేకరించిన ప్రతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అలాగే రైతుల వివరాలు తెలిపే చార్ట్ సిద్ధం చేయాలని, అందులో రైతుల సంఖ్య, వారు కలిగి ఉన్న పత్తి పరిమాణం, రైతు పేరు, ఫోన్ నంబర్, ఎకరాల సంఖ్య, మిల్లుకు తీసుకువచ్చే పత్తి పరిమాణం వంటి వివరాలు ఉండాలి వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. ఈ జాబితాను మార్కెటింగ్ అధికారి, పోలీసు శాఖ, సీసీఐ అధికారులకు, మిల్లర్లకు అందజేయాలని, జాబితాలో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే రైతులను మిల్లులోకి అనుమతించాలని అన్నారు. ప్రతి రైతును ఒక రోజు ముందు ఫోన్ ద్వారా సంప్రదించి,  వారి పత్తిని మిల్లుకు తీసుకొని రావలసిందిగా తెలియజేయాలని అన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్‌‌, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, సీ.సి.ఐ. ప్రతినిధి రాహుల్, సంబంధిత అధికారులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333