ఇది 30 పడకల ఆసుపత్రియా, లేకా సులబ్ కాంప్లెక్స్ అ

Nov 21, 2025 - 16:01
 0  21

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి

అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన దవాఖాన

ప్రజల డబ్బుతో నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేదు, ప్రభుత్వం మొద్దు నిద్రలో, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో!”

జోగులాంబ గద్వాల 21 నవంబర్ 225 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అయిజ. పట్టణంలో కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండిపోవడం అత్యంత బాధాకరం. ప్రజల కోసం నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఘోర అన్యాయం అని వారు వ్యక్తం చేశారు.

గతంలో BRS ప్రభుత్వం  ఈ ఆసుపత్రిని నిర్మించాలనుకుని, పర్మిషన్ కూడా తీసుకోకపోవడం ఎంత పెద్ద నిర్లక్ష్యమో*ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు *కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ, ఇంతవరకు పర్మిషన్ తీసుకోకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి పట్టిన లేమికి ఉదాహరణ అని ఆయన విమర్శించారు.

ఆసుపత్రి ప్రారంభం లేకపోవడంతో అయిజ మండలంలో మరియు పరిసర 100 పైగా గ్రామాల ప్రజలు అలాగే సమీప మండలాల ప్రజలు చిన్నచిన్న వ్యాధులకే గద్వాల, కర్నూలు, రాయచూర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ వరకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 గర్భిణీలు, వృద్ధులు, పేద కుటుంబాలు అత్యంత కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాణం పూర్తైన కొత్త ఆసుపత్రి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా చెత్తగా మారిందని, రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆసుపత్రి భవనం సులబ్ కాంప్లెక్స్‌ల్లా వాడబడుతున్న పరిస్థితి ప్రభుత్వం దారుణ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన అన్నారు.

“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఆసుపత్రి ఇలా పాడైపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అజాగ్రత్త, అసమర్థతకు నిదర్శనం. వెంటనే ఆసుపత్రిని శుభ్రపరచి, భద్రతా ఏర్పాట్లు చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని” డిమాండ్ చేశారు.

ఆసుపత్రి ప్రారంభమైతే లభించే ఎన్నో ప్రయోజనాలు.

 24 గంటల వైద్య సేవలు
 అత్యవసర చికిత్స, ప్రమాదాల సేవలు
 మాతృ-శిశు వైద్య సదుపాయాలు
 ల్యాబ్, ఎక్స్‌రే, డయాగ్నస్టిక్ సేవలు
పేదలకు ఉచిత వైద్య సేవలు

1. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే పర్మిషన్ ఇవ్వాలి
2. భవనాన్ని శుభ్రపరచి, రక్షణ చర్యలు చేపట్టాలి
3. ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి
4. వైద్య సిబ్బందిని అత్యవసరంగా నియమించాలి

ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడటం “భారతీయ జనతా పార్టీ" ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అవసరమైతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, అంజి, ఖుషి, బసన్న గౌడ్, నరసింహులు, కృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333