ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 07 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానయకుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చెరువుతో అడ్డగూడూరు మండలంలో మానయకుంట గ్రామాని తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారుల యొక్క ఇంటి నిర్మాణ ప్రగతిని ఎంపీడీవో పరిశీలించి, త్వరగా బేస్మెంట్ నిర్మాణం చేసుకొని ఒక లక్ష రూపాయలు బిల్లును తీసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.