మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
వారి అమూల్య సమయాన్ని విచ్చేసి నా ప్రచార సభలల్లో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు ఇతర కాంగ్రెస్ పెద్దలకు, గత కొన్ని నెలలుగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు, శక్తివంచన లేకుండా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించిన అధికారులకు, పోలీసులకు, సిబ్బందికి ప్రత్యేక కృతఙ్ఞతలు.