ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మేస్తిర్లకు,స్టీలు,సిమెంటు,ఇసుక ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు

Jul 2, 2025 - 18:46
 0  3
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మేస్తిర్లకు,స్టీలు,సిమెంటు,ఇసుక ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు

అడ్డగూడూరు 01 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మేస్తిర్లకు,స్టీలు సిమెంటు,ఇసుక ట్రాక్టర్ల యజమానులకు ఎంపీడీవో కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు.మండల పరిషత్ కార్యాలయం నందు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించిన మేస్త్రీలు ట్రాక్టర్ డ్రైవర్లు యూనియన్ బాధ్యులు స్టీలు మరియు సిమెంటు సప్లయర్స్ మరియు యజమానులతో రేట్లు నిర్ణయములకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజులతో పోలిస్తే ఇసుక రవాణాకు ట్రక్కుకు 300 రూపాయలు చొప్పున తక్కువ తీసుకోవడానికి ట్రాక్టర్ యజమానుదారులు అంగీకరించారు. అదేవిధంగా ఇంటి నిర్మాణం మేస్తిర్లు చదరపు అడుగుకు ప్రభుత్వం నిర్దేశించిన కొలతలతో ప్రభుత్వం నిర్దేశించిన ప్లాన్ ప్రకారం మెట్లుతో సహా నిర్మించి ఇవ్వడానికి చదరపు అడుగుకు 290 రూపాయల చొప్పున నిర్మాణం చేయుటకు అంగీకరించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా సిమెంట్ సప్లయర్లు సిమెంట్ బస్తాకు ప్రస్తుతం ఉన్న రేటు కంటే పది రూపాయలు తగ్గించి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది.ఐరన్ సప్లయర్లు ఒక బార్ కు ప్రస్తుతం ఉన్న రేటు కంటే10 రూపాయలు తగ్గించి ఇవ్వడానికి అలాగే ఒక టన్నుకు ప్రస్తుతం ఉన్న రేటు కంటే 1000 రూపాయలు తగ్గించి తీసుకోవడానికి అంగీకరించాలని ఎంపీడీవో శంకరయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,తాసిల్దార్ శేషగిరిరావు, డిప్యూటీ తాసిల్దార్,ఎంపీఓ ప్రేమలత,హౌసింగ్ ఏఈ,ఎస్సై కే వెంకటరెడ్డి,పంచాయతీ కార్యదర్శులు,మేస్త్రిలు,స్టీలు సిమెంటు యజమానులు,ఇసుక ట్రాక్టర్ యజమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333