ఆశ వర్కర్లు చేసే LCD సర్వేను ANM లతో చేయించడం విరమించాలని DMHO కి విజ్ఞప్తి .
రాష్ట్రంవ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా ఏ ఎన్ ఎం లతో LCD సర్వే చేయించడం లేదని గద్వాల లోమాత్రం చేయించడం దుర్మార్గం
-AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.
జోగులాంబ గద్వాల 6 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల .జిల్లా లోని EC ANM, 2nd ANM, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం లను వారి పనితో పాటు ఆశ వర్కర్లు చేసే LCDC సర్వేపనులను కూడా అధికారులు చేయించు కుంటు న్నారు దీనివలన ఏ ఎన్ ఎమ్ లకు పని బారం పెరిగి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనీ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు విమర్శించారు .ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో పనిచేస్తున్న ఆల్ ANM అందరు కలసి LCD సర్వే అదనపు పనులను ANM ల (మా)తో చేయించకుండ నిలిపి వేయాలని కోరుతూ DM &HO సిద్దప్ప కి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు .
ఈసందర్భగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (AITUC) జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు & anm లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలలో కూడా ANM లతో LCDC సర్వే పని చేయించడం లేదని , గద్వాల జిల్లాలో మాత్రం చేయించడం అనేది సరైనది కాదనీ అంతే కాకుండా ఎప్పుడు ANM లు చేసే పనే చాలా ఒత్తిడితో కుడుకున్నదని మరల దానితో పాటు LCDC ఆశావర్కర్ల చేసే సర్వే పనినీ చేయించడం వలన వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. వాస్తవానికి ఇది ANM లు చేసే పని కాదని, అందువల్ల సర్వే నుండి ANM లను మినహాయింపు ఇవ్వాలని కోరారు.ఈ పని వేర్ వాళ్ళకి అప్పగించాలని డిమాండ్ చేశారు.లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు .ఈ సందర్భంగా DMHO తో చర్చించి వినతి పత్రం ఆయనకు అందజేయడం జరిగిందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మ,భారతి , నాగమ్మ, సరస్వతి,తదితరులు పాల్గొన్నారు.