అవేర్ కాలనీ వాసులకు కోసం కమ్యూనిటీ హాల్ లకు హామీ ఇవ్వడం జరిగింది

మంత్రి పొంగులేటి". కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్

Oct 22, 2024 - 14:47
Oct 22, 2024 - 21:48
 0  8
అవేర్ కాలనీ వాసులకు కోసం కమ్యూనిటీ హాల్ లకు హామీ ఇవ్వడం జరిగింది

తెలంగాణ వార్త ప్రతినిధి: స్థానిక వరంగల్ క్రాస్ రోడ్ అవేర్ కాలనీ(లేప్రసీ కాలనీ) వారు ఏ మీటింగ్ నిర్వహించుకోవాలన్న,వివాహ శుభ కార్యక్రమాలు జరుపుకోవాలన్న ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లేక వారు పడుతున్న ఇబ్బందులను పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ దృష్టి కి తేగా వెంటనే స్పందించి గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసుల చిరకాల కోరిక అయిన కమ్యూనిటీ హాల్ విషయమై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి శ్రీ తుంబూరు.దయాకర్ రెడ్డి గారకి సమస్యను వివరించిన సురేష్ నాయక్.ఇట్టి అవేర్ కాలనీ వాసుల కోరికను తొందర్లోనే నెరవేరుస్థనని హామి ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయమై తుంబూరు.దయాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్.వారి తో పాటు కళ్లెం.శేష్ రెడ్డి, పవన్,స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State