ఆశీర్వదించండి తండానూ అభివృద్ధి చేస్తా
తిరుమలగిరి 07 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం కన్నా రెడ్డి కుంట తండా లో మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లకావత్ శ్రీను ప్రచారంలో ముందంజలో సాగుతున్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది గతంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ నన్ను ఆశీర్వదించండి తండాలో సిసి రోడ్డు డ్రైనేజీ విద్యుత్ సమస్యలు వైకుంఠధామాలు సాలగూడెం నుండి భూఖ్య తండ వరకు లింకు రోడ్లు వేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బావ్ సింగ్ ,బాలాజీ ,సంతోష్ ,బద్దు, హీరూ ,అశోక్ ,పరశురాములు, సోమన్న తదితరులు పాల్గొన్నారు...